కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీని గెలిపించాలని దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని వారికి దిశా నిర్దేశం చేశారు.