నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం తిప్పరస్ పల్లి, ఓబులాపురం, పగిడిమారి గ్రామ పరిసర ప్రాంతాల్లో జింకల బెడద ఎక్కువైనది. ప్రస్తుతము రోహిణి, మృగశిర కార్తి వచ్చిన సందర్భంగా అందరు రైతులు సాగుకు సమానత్వం చేస్తూ విత్తనాలు భూమిలో నాటుతున్న సందర్భంగా వారం 15 రోజుల నుండి మొలకలు ఎత్తుతున్నవి. జింకల బెడద వలన విత్తనాలు రెండుసార్లు వేసే పరిస్థితి ఏర్పడుతున్నది. రైతులు ఫిర్యాదు చేసిన అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు అని రైతులు వాపోయారు.