నారాయణపేట జిల్లా కేంద్రంలో మంగళవారం హనుమాన్ దేవాలయంలోని శిఖరాలకు స్థానిక భీష్మరాజ్ ఫౌండేషన్ అధినేత రాజ్ కుమార్ రెడ్డి తన వంతు సహాయంగా రూ. 10 లక్షల భారీ విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు భీష్మరాజ్ ఫౌండేషన్ అధినేత రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.