నారాయణపేట జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ తెలియజేశారు. జిల్లాలోని 12 పోలీస్ స్టేషన్ లలో 2816 కేసులు గుర్తించబడినవి అన్నారు మొత్తం అని కేసులలో 4,10,000 జరిమానా విధించడం జరిగింది అన్నారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.