పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని డిఎస్పీ లింగయ్య అన్నారు. శనివారం నారాయణపేట డిఎస్పీ కార్యాలయంలో కోస్గి, మరికల్, మక్తల్ సర్కిల్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు పట్టణాలు, పల్లెల్లో రాత్రి సమయంలో గస్తీ పెంచాలని అన్నారు.