నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల కేంద్రంలోని కంసాన్పల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న దళితవాడలో రహదారి గుంతలు ఏర్పడిన అధికారులు పట్టించుకోవడంలేదని సీపీఐ పేట జిల్లా కార్యవర్గ సభ్యులు పి. వెంకటేష్ ఆదివారం ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రెండు రోజుల్లోపు గుంతలను పూర్తి చేయకపోతే సీపీఐ ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.