పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

53చూసినవారు
పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నదర్పల్లి గ్రామంలోని హంసాశ్రీ పాఠశాలలో మంగళవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయులు రంగురంగుల పూలను పేర్చి బతుకమ్మలను తయారుచేశారు. దాని చుట్టూ ఆడిపాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్, నందన్ కుమార్, సిబ్బంది, విధ్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్