వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని నారాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి సలీం విమర్శించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రాన్ని ఆగం చేసిన ఆ పార్టీ ప్రజల్లో ఎప్పుడో ఆదరణ కోల్పోయిందన్నారు. ప్రజలు ఆ పార్టీని ఆ పార్టీ నాయకులను కూడా ఎప్పుడో మర్చిపోయారన్నారు.