వనపర్తిలో సీఎం రేవంత్ దిష్టి బొమ్మ దగ్ధం..!

58చూసినవారు
అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, యువత అధ్యక్షుడు సూర్యవంశం గిరి, తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్