వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ ఉద్ధంసింగ్ 84వ వర్ధంతి టీజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కవులు, కళాకారులు, ఉద్యమకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ. దేశం కోసం పోరాటం నిర్వహించి ఔన్నత్యం చాటిన ఉద్దంసింగ్ చమార్ గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. గిరిజాచారి, దేవన్నన్నాయుడు, బాలేమీయ్య పాల్గొన్నారు.