వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం పడటంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఇటీవల ఇంత పెద్ద చినుకులతో వర్షం పడటం ఇదే తొలిసారి అని స్థానికులు అంటున్నారు. ప్రాజెక్టుల నీళ్లు రాక బావులు, చెరువుల కింద నాట్లేస్తున్నా రైతులు ఈ వర్షంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.