వనపర్తి జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో గురువారం అధికారులు ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి వరద నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. జలాశయం నుంచి 3. 22 లక్షల క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.