వనపర్తి: కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

57చూసినవారు
వనపర్తి: కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలోని 22వ వార్డు బాలాజీ నగర్ లో గల కుట్టు శిక్షణ కేంద్రాన్ని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకురాలు హసీనాతో శిక్షణ కేంద్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రామానంద తీర్థ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కేంద్రంను ఏర్పాటు చేశారని, తదనంతరం తామే కొనసాగిస్తున్నామని, నేటి వరకు 3 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణను ఇచ్చామని తెలిపారు.

సంబంధిత పోస్ట్