ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను వనపర్తి టీజేఏసీ, తెలంగాణ జన సమితి నేతలు హైదరాబాద్ పార్టీ ఆఫీసులో కలిశారు. పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా టీజేఏసీ కన్వీనర్ రాజారాం ప్రకాష్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎండి ఖాదర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.