పెట్రోల్ బంకులు తెరిపించాలని తహశీల్దార్ కు వినతి

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్ బంకులు 9 నెలల నుంచి బంద్ అయ్యాయని, వెంటనే బంకులు తెరిపించాలని బుధవారం గ్రామస్తులు తహశీల్దారు వినతి పత్రం అందించారు. పెట్రోల్ బంకులు మూసి ఉండడం వల్ల అల్వాల, మోజర్ల, మణిగిల్ల, చిన్నమందడి, దొడగుంటపల్లి గ్రామాల రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ నరేష్, కుమార్ పాల్గొన్నారు.