వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంకు చెందిన విజయ్ కుమార్ ఆచారి వైద్య ఖర్చుల కోసం రూ. 60 వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి బాధితుడికి అందజేశారు. విజయ్ కుమార్ ఆచారి అనారోగ్య సమస్యను పెబ్బేర్ కాంగ్రెస్ పట్టణ ప్రెసిడెంట్ వెంకట్ రాములు చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, చిన్నారెడ్డి నిధులు మంజూరు చేయించారు. సుబ్బయ్య గుప్త, తదితరులు పాల్గొన్నారు.