మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, డిప్యూటీ సి. ఎం భట్టి విక్రమార్క లు క్షమాపణ చెప్పాలని బుధవారం వనపర్తి మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ మహిళా నేత నందిమల్ల శారద డిమాండ్ చేశారు. అక్కలను నమ్ముకుంటే జూబ్లీహిల్స్ బస్టాండ్ అవుతుందని అర్థం లేని, అవమానించే వ్యాఖ్యలు చేయటం సీఎంకు స్థాయికి తగదన్నారు. సీఎం, డిప్యూటీ సి. ఎం లు ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ మహిళలందరినీ అవమానించారని పేర్కొన్నారు.