వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య వేడుకలో భాగంగా అలరించిన చిన్నారుల నృత్యం గురువారం ఉదయం గ్రామంలోని ప్రభాతభేరి చేస్తూ వివిధ చోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థుల నృత్యాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.