అసంఘటిత రంగ కార్మికులందరికీ కనీసవేతనం రూ. 26, 000 ఇవ్వాలని ఏఐటీయుసీ వనపర్తి జిల్లా అధ్యక్షులు శ్రీహరి, కార్యదర్శి మోష, గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలన్నారు. సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నిర్మాణ కౌన్సిల్ లో కార్మికుల పలు డిమాండ్లపై చర్చించి తీర్మానాలు చేశామన్నారు.