మహిళా సాధికారతపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మహిళా ఉపాధ్యాయినీల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. అణగారిన వర్గాలలో అక్షర జ్ఞానం నింపేందుకు సావిత్రిబాయి పూలే నిరంతరం శ్రమించిందని తెలిపారు.