బోయిన్ పల్లి కాలనీకి చెందినబత్తిన హరి కృష్ణ గత మూడు సంవత్సరాల నుండి బోన్ ట్యూమర్ కు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం శుక్రవారం వనపర్తి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి రూ. 4 లక్షల ఎల్ఓసి అందజేశారు. నిమ్స్ డాక్టర్స్ తో మాట్లాడి వెంటనే శస్త్ర చికిత్స కు ఏర్పాట్లు చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులు చిన్నారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.