వనపర్తి: ఆలయానికి మాజీ ఎంపీ రావుల 50 తులాల వెండి వితరణ

56చూసినవారు
వనపర్తి: ఆలయానికి మాజీ ఎంపీ రావుల 50 తులాల వెండి వితరణ
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి శుక్రవారం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తన తల్లి కీ. శే రావుల వెంకట పద్మమ్మ జ్ఞాపకార్థంగా 50 తులాల వెండి ఆభరణాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో మాజీ ఎంపీ రావుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రావులను సత్కరించారు.

సంబంధిత పోస్ట్