2023-24 రబీ సీజన్ కు సంబంధించి ఎఫ్.సీ.ఐకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని జనవరి 25 లోపు పూర్తి చేయాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రైస్ మిల్లర్ల సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోపు మిల్లర్లు ధాన్యాన్ని అప్పగించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.