రైతులను కొంతమంది మిల్లర్లు కావాలని తరుగు పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం వనపర్తిలోని సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ. రైతులు ఎట్టి పరిస్థితుల్లో మిల్లుకు వెళ్లవద్దని కొనుగోలు కేంద్రంలోనే రశీదు తీసుకోవాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.