వనపర్తి: తహశీల్దార్ కార్యాలయల నిర్మాణానికి రూ. 96లక్షలు మంజూరు

56చూసినవారు
వనపర్తి జిల్లాలో కొత్తగా ఏర్పడిన మూడు మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాలను నిర్మించడానికి రూ. 96 లక్షలు నిధులు మంజూరు అయినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. అదే విధంగా సంబంధిత మండలాల్లో స్టేషన్ హౌస్ ఆఫీస్లు సైతం కొత్త భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెబ్బేరులో ఒక సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్