వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో లారీల సమస్య లేకుండా చూడండి

84చూసినవారు
వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో లారీల సమస్య లేకుండా చూడండి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలోని ధాన్యం తరలింపులో లారీల సమస్య లేకుండా చూడాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. ఎవరైనా లారీలు పెట్టడానికి ఇబ్బంది కలిగిస్తే డీఎస్పీకి ఫిర్యాదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్