ఉద్యోగ పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాలో ఏఎస్ఐ నుంచి ఎస్ఐలుగా ఉద్యోగ పదోన్నతి పొందిన నలుగురు పోలీసులను ఎస్పి అభినందించారు. ఉద్యోగోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలని, క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వహించాలని అన్నారు.