లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అయితే మస్తాన్ సాయి మాత్రం.. తనకు ఏమీ తెలియదని, ఆ హార్డ్‌డిస్క్‌లో తన వీడియోలు లేవని పేర్కొన్నాడు. లావణ్య పోలీసులకు ఇచ్చిన మస్తాన్ సాయి హార్డ్‌డిస్క్‌లో 200కి పైగా వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ‘ప్రైవేట్’ వీడియోలు చిత్రీకరించినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.