2021లో ఈడీ ఈ కేసు దర్యాప్తు మొదలెట్టింది. యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్‌కు చెరో 38% వాటాలు ఉన్నాయని, మోసపూరితంగా ఈ కంపెనీలోకి ఆస్తుల్ని బదలాయించారనేది ఆరోపణ. కేసులో యంగ్ ఇండియన్, డొటెక్స్ మెర్చండైజ్ ప్రై.లి. సంస్థల్ని, సునీల్ భండారీని నిందితులుగా చేర్చింది. సోనియా, రాహుల్‌ను "యాజమాన్య లబ్దిదారులు”గా పేర్కొంది. కేసుతో ముడిపడిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.