కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చిన జబ్బులపై ప్రజలకు అవగ
ాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈవాళ ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీపై ఫుల్ పబ్లిసిటీ అవసరం అన్నారు. ఈ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ తరహాలో ఓ విధానాన్ని అమలు చేస్తూ ట్రాన్స్ ప్లాంటేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేయాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులపై స్పాట్ అడ్మిషన్లు ఉండేలా ఆదేశాలివ్వాలన్నారు. ప్రాథమిక స్థాయిలో డయాలసిస్ సెంటర్లు అవసరం అన్నారు.