దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న నీట్-యూజీ పరీక్షకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే మే 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది.