బజాజ్ డామినార్ 400, డామినార్ 250 బైక్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. డామినార్ 250 ధర ₹1.92 లక్షలు, డామినార్ 400 ₹2.39 లక్షలు (ఎక్స్‌షోరూమ్). కొత్తగా రైడింగ్ మోడ్స్, డిజిటల్ డిస్‌ప్లే, హ్యాండిల్‌బార్‌లో మార్పులు వచ్చాయి. డామినార్ 400లో 373cc, 39HP ఇంజిన్, 250లో 248cc, 26HP ఇంజిన్ ఉంది. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, టెక్నాలజీ అప్‌డేట్స్‌తో ఫీచర్ల పరంగా ఆకట్టుకుంటున్నాయి.