గుజరాత్‌లోని సూరత్‌లో మున్సిపల్ కార్పొరేషన్ పెంపుడు కుక్కలపై కొత్త ఆంక్షలు విధించింది. ఇంట్లో శునకాన్ని పెంచాలంటే కనీసం 10 మంది పొరుగువారి నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలి. అపార్ట్‌మెంట్‌లో పెంచాలంటే భవన సంక్షేమ సంఘం అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మే నెలలో కుక్క దాడిలో ఓ చిన్నారి మృతి చెందడంతో ఈ నిబంధన విధించాల్సి వచ్చిందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.