తెలంగాణలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు, ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్నును కూడా 100 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏడాదికి రూ.లక్ష ఆదా అవుతుందని తెలిపారు.