తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు తలెత్తిన లొల్లి మాత్రం సరికొత్తదనే చెప్పాలి. పార్టీలో ఇప్పుడు ఏకంగా కొందరు ప్రజాప్రతినిధులు, లీడర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ హాట్ టాపిక్ అవుతోంది. తాము టార్గెట్ చేస్తున్న నేతల సస్పెన్షన్ కోసం పార్టీ వేదికలతో పాటు, సమావేశాలు పెట్టుకుని మరీ గొంతెత్తున్నారు. సొంత పార్టీ, పైగా అధికార పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే డిమాండ్ కాంగ్రెస్లో కాక రేపుతోంది.