మామిడి పరిశోధకుడు కరీముల్లా ఖాన్ అభివృద్ధి చేసిన కొత్త మామిడి రకానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు పెట్టారు. దీన్ని ఇకపై ‘రాజ్‌నాథ్ మామిడి’గా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరీముల్లా గతంలో మోదీ, సోనియా, అమిత్ షా, సచిన్, ఐశ్వర్యా రాయ్ పేర్లతో మామిడి రకాల్ని అభివృద్ధి చేశారు. ఆయన సేవలకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ప్రత్యేక గ్రాఫ్టింగ్ టెక్నిక్‌తో మామిడిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.