TG: మార్పు కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు దీవించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. నాలుగు విడత్లలో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.