తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఏప్రిల్ నుంచి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి BPL కార్డులు, ఎగువన ఉన్నవారికి APL కార్డులు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్లకార్డు ఉన్నవారికి ట్రైకలర్ కార్డులు అందజేస్తామని ఇప్పటికే పేర్కొన్నారు.