TG: అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను కూడా స్వీకరించింది. అర్హులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జనవరి 28 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ జరిగే కలెక్టర్లతో సమావేశంతో మరింత స్పష్టత రానుంది.