ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ శుభవార్త చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఈ నెల 26న ఇందిరమ్మ ఇళ్ల పంపిణి పత్రాలు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం ఈ నెల 16వ తేది నుంచి 20వ తేది వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందని, ఈ సమాచారం మేరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజాభిప్రాయసేకరణ పెట్టి అర్హులను నిర్ణయిస్తామన్నారు.