దేశంలో ఎయిర్ కండీషనర్స్ (ఏసీ) వినియోగానికి సంబంధించిన కొత్త నిబంధనలు రాబోతున్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా ఏసీల టెంపరేచర్‌కు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించేందుకు సిద్ధమవుతోంది. కనిష్ఠంగా 20 డిగ్రీ సెల్సియస్, గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్ మించకుండా కొత్తగా తయారయ్యే ఏసీలకు ప్రమాణాలను నిర్దేశించనున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వెల్లడించారు.