కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి మహారాష్ట్ర సర్కార్ బిగ్ షాకిచ్చింది. 'నో పార్కింగ్, నో కార్' అనే కొత్త రూల్ ను తీసుకువచ్చింది. ఈ నియమం ప్రకారం, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ముందు సంబంధిత అధికారుల నుంచి పార్కింగ్ స్పేస్ ప్రూఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పార్కింగ్ స్థలం లేకపోవడం వలన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఓపెన్ స్పేస్‌లు కార్లతో నిండిపోతున్నాయని, అందుకే ఈ రూల్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది.