TG: పెన్షన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురాబోతుంది. ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుండగా.. జూన్ నుంచి ఫేస్ రికగ్నిషన్ విధానంలో పెన్షన్ పంపిణీ చేయాలని సర్కార్ కసరత్తు చేస్తోంది. కొత్త యాప్‌ను కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలి ముద్రలు పడకపోవడం అనే సమస్య ఉండడంతో, ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేశాకే పెన్షన్ ఇవ్వాలని భావిస్తోంది. కొత్త విధానం అమలులోకి వస్తే.. నకిలీ పెన్షన్లు రద్దు అవుతాయి.