టైప్-5 డయాబెటిస్ అనే కొత్త రకాన్ని కనుగొన్నట్లు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) తాజాగా ప్రకటించింది. దీనిని మోనోజెనిక్ డయాబెటిస్‌గా పిలుస్తారు. ఇది అరుదైన, జన్యుపరంగా సంక్రమించిన డయాబెటిస్ రూపం. రక్తంలో చక్కెరను నియంత్రించే, ప్రభావితం చేసే ఒకే జన్యువులోని మ్యుటేషన్ వల్ల ఇది వస్తుంది. ముఖ్యంగా బరువు తక్కువగా ఉండే వారిలోనూ, వారసత్వంగా మధుమేహం లేని వారిలోనూ ఇది కనిపిస్తోంది.