కొత్త వైరస్.. ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!

331014చూసినవారు
కొత్త వైరస్..  ఇది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి!
కరోనా వైరస్ కొత్త వేరియంట్లలో రూపంలో టెన్షన్ పెట్టిస్తుంటే తాజాగా శాస్త్రవేత్తలు మరో వైరస్ ను గుర్తించారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ‘నియో కోవ్‌’ అనే కొత్త రకం వైరస్‌ కు సంబంధించిన సంచలన విషయాలు వుహాన్ శాస్త్రవేత్తలు బయటపెట్టారు. నియోకోవ్ వైర‌స్ మొద‌ట ద‌క్షిణాఫ్రికాలోని గ‌బ్బిలాల్లో క‌నుగోన్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. ఆ వైర‌స్ కార‌ణంగా అధిక మ‌ర‌ణాలు సంభ‌విస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. కొత్త వైర‌స్ సంక్ర‌మ‌ణ రేటు కూడా అధికంగానే ఉంటుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ వైర‌స్ సోకిన ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు మ‌ర‌ణిస్తార‌ని సైంటిస్టులు చెప్పారు. కాగా ప్రస్తుతం ఈ వైరస్ జంతువుల్లోనే ఉందని, మనుషులకు ఇంకా సోకలేదని తెలిపారు. ఈ వైరస్ పై మరిన్ని అధ్యయనాలు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్