'టీమిండియాను ఓడించగల జట్టు ఏదైనా ఉంటే అది ఒక్క న్యూజిలాండ్ మాత్రమే' అని ఆదివారం భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. 'స్వల్ప తేడాతో భారత్ ఫేవరెట్‌గా ఉంటుంది' అని ఆయన తెలిపారు. దుబాయ్‌లో జరగనున్న ఇండియా-న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు 4 సార్లు తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ 3 మ్యాచ్లలో గెలవగా, భారత్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.