భర్త డబ్బులు ఇవ్వలేదని నవ వధువు సూసైడ్!

70చూసినవారు
భర్త డబ్బులు ఇవ్వలేదని నవ వధువు సూసైడ్!
AP: నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ ఎర్రిస్వామి వివరాల ప్రకారం.. కోడుమూరుకు చెందిన నాగరాజుతో వర్కూరుకు చెందిన శృతి(16)కి వివాహం జరిగింది. ఈ నెల 7న చెప్పులు కొనుక్కోవడానికి శృతి డబ్బులు అడగగా భర్త ఇవ్వలేదు. దీంతో తీవ్రమనస్తాపం చెంది వాస్మాయిల్ తాగడంతో కుటుంబీకులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్