వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కష్టంగా ఉన్నప్పటికీ, చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 29 ఏళ్ల ఈ ప్లేయర్ 106 టీ20ల్లో 2,275 పరుగులు, 61 వన్డేల్లో 1,983 రన్స్ చేశారు. వీటిలో 3 సెంచరీలు ఉన్నాయి. పూరన్ అందించిన సేవలకు విండీస్ క్రికెట్ బోర్డు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసింది.