ఇటాలియన్ లగ్జరీ కారు తయారీ సంస్థ లంబోర్గినీ ఇండియా హెడ్‌గా నిధి కైస్తా నియమితులయ్యారు. ఆమె భారత్‌లో సంస్థ విక్రయాలు, మార్కెటింగ్, ఆఫ్టర్ సేల్స్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు పోర్షే ఇండియాలో రీజినల్ సేల్స్, ప్రీ ఓన్డ్ కార్ల మేనేజర్‌గా సేవలందించారు. ఆమె నాయకత్వంలో సంస్థ మరింత పురోగతిని సాధిస్తుందని ఆసియా పసిఫిక్ రీజియన్ డైరెక్టర్ ఫ్రాన్సెస్కో స్కార్డియోనీ తెలిపారు.