ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలో జూన్ 11న ఓ నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన నీల్‌గయ్ అనే జంతువు భయానకంగా ప్రవర్తించి కలకలం రేపింది. నీల్‌గయ్ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా ఓ వాహనాన్ని ధ్వంసం చేసి ఇతర ఆస్తులకు కూడా నష్టం కలిగించింది. ఆ తర్వాత నీల్‌గయ్ అదుపుతప్పి ఇనుప గేటును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.